ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడిబండలో ఒప్పంద కార్మికులు, అధ్యాపకుల నిరసన

అనంతపురం జిల్లా గుడిబండ మండల కేంద్రంలో జ్యోతిబాపూలే బాలికల కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు, అధ్యాపకులు నిరసన చేపట్టారు. తమను విధుల నుంచి తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

గుడిబండ మండలంలో ఒప్పంద కార్మికులు, అధ్యాపకుల నిరసన
గుడిబండ మండలంలో ఒప్పంద కార్మికులు, అధ్యాపకుల నిరసన

By

Published : Sep 29, 2020, 7:40 PM IST

తమను విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు, అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. వీరికి ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. తొలగింపునకు గురైన వారు మాట్లాడుతూ... గతంలో ఈ ప్రదేశంలో గురుకుల బాలికల కళాశాల నిర్మించేందుకు తమ భూమిని ఇచ్చామని తెలిపారు. నాలుగు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నామని... ఇప్పుడు ఉన్నపళంగా కార్మికులను, అధ్యాపకులను ఏకారణం లేకుండానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భూములు కోల్పోయిన తమకు ఉద్యోగము తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యం అని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details