ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒప్పంద ఉద్యోగి ఆవేదన.. దండోరా వేసి నిరసన - డప్పు కొట్టి వినూత్నరీతి

ఆయన ముప్పై ఏళ్లుగా ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భార్యకు అనారోగ్యంగా ఉండటంతో విధులకు హాజరుకాలేకపోయాడు. అధికారులు ఆయనను తొలగించి ఆ స్థానంలో మరోవ్యక్తికి ఉద్యోగం కల్పించారు. తన ఉద్యోగం తనకు ఇవ్వాలని బాధితుడు అధికారులను ప్రాధేయపడ్డాడు. కాళ్లు అరిగేలా వారిచుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ఎవ్వరూ సరైన రీతిలో స్పందించలేదు. దాంతో ఆయన గుండెలోని ఆవేదనను డప్పు చప్పుడుగా మార్చి వినూత్నంగా నిరసన తెలిపాడు. జీవనాధారం కోల్పోయి ఎలా బతకమంటారని ప్రశ్నించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగింది.

contract employee protest
ఒప్పంద ఉద్యోగి ఆవేదన

By

Published : Nov 11, 2020, 8:54 PM IST

Updated : Nov 11, 2020, 10:53 PM IST

బాధితుడి ఆవేదన

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓ కాంటాక్ట్ ఉద్యోగి నిరసన చేపట్టాడు. కార్యాలయంలోని ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ పార్క్​లో 30ఏళ్ల నుంచి ఒప్పంద ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న తిప్పన అనే వ్యక్తిని ఇటీవల అధికారులు తొలగించారు. అందుకు ఆయన కార్యాలయం ఆవరణలో డప్పు కొట్టి వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశాడు.

భార్య అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాలేకపోయానని, దాంతో అధికారులు తన ఉద్యోగాన్ని మరో వ్యక్తికి ఇచ్చారని గోడు వెళ్లబోసుకున్నాడు. జీవనాధారం కోల్పోయి ఎలా బతకమంటారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందించలేదని పేర్కొన్నారు. అందువల్లే కార్యాలయం చుట్టూ దండోరా కొడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నానని తెలిపాడు.

ఏడాదిన్నరగా రాలేదు..!

ఏడాదిన్నరగా తిప్పన విధులకు హాజరు కాలేదని ఇంజనీరింగ్ సెక్షన్ అధికారి మల్లికార్జున తెలిపారు. పూర్తి వివరాలు కమిషనర్ తెలియజేస్తారని, ప్రస్తుతం అందుబాటులో లేరని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:
"అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలి"

Last Updated : Nov 11, 2020, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details