వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాశారు. మరో వైపు బ్యాంకుల వద్ద రైతులు తమ పంట రుణాలను రెన్యువల్ చేసుకోవడానికి వందల సంఖ్యలో గుమ్మిగూడారు. ఈ క్రమంలో ఎవరూ సామాజిక దూరాన్ని పాటించలేదు. ప్రతి బ్యాంకు ముందు వందల సంఖ్యలో రైతులు ఉండటంతో తోపులాట జరిగింది. వీరిని నియంత్రించటం పోలీసులకు కష్టంగా మారింది. సంబంధిత బ్యాంకు అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక షామియానాల కింద కూడా స్థలం తక్కువై.. ప్రజలు రోడ్ల మీద బారులుతీరి కనిపించారు. తమ పంట రెన్యువల్ కాలాన్ని పొడగించాలని, లేకుంటే ప్రత్యామ్నాయ మార్గం సూచించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై పై ఎన్ని సార్లు ఆందోళన చేసిన సంబంధిత అధికారులు ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కళ్యాణదుర్గంలో వినియోగదారులు, రైతుల పాట్లు.... - latest news in Kalyanadurgam
అధికారులు, ప్రభుత్వాల బాధ్యతారహితంగా వల్ల రైతులు, గ్యాస్ వినియోగదారులు నానా తంటాలు పడుతున్నారు. సమస్య నివృతి కోసం కార్యాలయాల ఎదుట నిరీక్షించాల్సి వస్తోంది.
farmers