అనంతపురం జిల్లా కదిరి శివారులో..బాహ్యవలయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పులివెందుల - బెంగళూరు రహదారి సహా.. ముంబయి - చెన్నై జాతీయ రహదారిని కలుపుతూ నిర్మించాలని..గత ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 12 కిలోమీటర్ల మేర.. బాహ్యవలయ రహదారికి శ్రీకారం చుట్టింది. 234 కోట్ల రూపాయల అంచనాలతో.. ప్రభుత్వ భూమితో పాటు దాదాపు 250 మంది రైతుల భూములతో కలిపి.. 145 ఎకరాల భూమిని సేకరించారు.
Outer Ringroad Works: బాహ్యవలయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభం
అనంతపురం జిల్లా కదిరి బాహ్యవలయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. పులివెందుల - బెంగళూరు రహదారి సహా.. ముంబయి - చెన్నై జాతీయ రహదారిని కలుపుతూ దీనిని నిర్మించనున్నారు.
రింగురోడ్డు పనులు ప్రారంభం
90 శాతం మందికి పైగా రైతులకు పరిహారం చెల్లించారు. అయితే.. కొన్ని కారణాల వల్ల పనుల ప్రారంభం ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా మిగతా రైతుల పరిహారం కొలిక్కి రావడం వల్ల.. బాహ్యవలయ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. పనులను అధికారులతో కలిసి కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పరిశీలించారు.
ఇదీ చదవండీ..Bio mining: డంపింగ్ యార్డుల్లో బయోమైనింగ్ విధానం.. చెత్తశుద్ధికి ముందడుగు