అనంతపురం జిల్లా పామిడి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. చికిత్స అనంతరం శనివారం సాయంత్రం తిరిగి విధులకు హాజరయ్యారు. వీరిని స్థానిక సీఐ శ్రీనివాసులు సన్మానించారు. కరోనా మహమ్మారిని జయించి ప్రజాసేవ కోసం విధులకు హాజరైన ఇద్దరు కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు. అలాగే జిల్లాలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు.
కరోనా జయించి విధులకు హాజరైన కానిస్టేబుళ్లకు సన్మానం - pamidi constables joined their duties latest news
కరోనాను జయించి తిరిగి విధులకు హాజరైన ఇద్దరు కానిస్టేబుళ్లను పమిడి సీఐ శ్రీనివాసులు సన్మానించారు. ప్రజలకు సేవ చేసేందుకు విధులకు హాజరైన కానిస్టేబుళ్లను అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కానిస్టేబుళ్లకు స్వాగతం పలుకుతున్న పామిడి పోలీసులు