ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత జగన్​దే' - కదిరిలో పీసీసీ ఏపీ అధ్యక్షుడు తులసి రెడ్డి మీడియా సమావేశం

18 నెలల వైకాపా పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అనంతపురం జిల్లా కదిరిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి మండిపడ్డారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ధ్వజమెత్తారు.

అనంతపురం జిల్లా కదిరిలో పీసీసీ ఏపీ అధ్యక్షుడు తులసి రెడ్డి మీడియా సమావేశం
అనంతపురం జిల్లా కదిరిలో పీసీసీ ఏపీ అధ్యక్షుడు తులసి రెడ్డి మీడియా సమావేశం

By

Published : Dec 10, 2020, 7:53 PM IST



సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. 18 నెలల వైకాపా పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ఎన్నికల అధికారిదేనని తులసి రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలను నిర్వహించే సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తుందా..? అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్​ఈసీకి ప్రభుత్వం సహకరించడం మంచి సంప్రదాయమని ఆయన హితవు పలికారు.


ఇవీ చదవండి

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి'

ABOUT THE AUTHOR

...view details