అనంతపురం జిల్లాలోని ప్రాదేశిక ఎన్నికల్లో హస్తం పార్టీ తొలి విజయం సాధించింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో.. మడకశిర మండలం గంగులవాయిపాలెం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మమ్మ 294 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఇదీ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి సొంత పంచాయతీ. తమపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు పంచాయతీ ప్రజలకు రఘువీరారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
CONGRESS: గంగులవాయిపాలెంలో ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు - ananthapuram district latest news
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత రఘవీరారెడ్డి సొంత పంచాయతీ అయిన అనంతపురం జిల్లా గంగులవాయిపాలెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మమ్మ 294 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
గంగులవాయిపాలెంలో ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు