తెలుగు సాహిత్యం, భాషాభివృద్ధికి.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాసులు చేస్తున్న కృషిని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. "తెలుగు సాహితీమూర్తుల ముఖచిత్రాలు - రేపటి తరం కోసం" పేరిట కాలమానిని ముద్రించారు. సాహితీవేత్తల జయంతులు, వర్ధంతులు విషయాన్ని శోధించే సమయంలో.. రామోజీ ఫౌండేషన్ ద్వారా ఈ అంశం ఉపరాష్ట్రపతి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. సాహితీసేవలో శ్రీనివాసులుకు ఆయన సతీమణి యశోద, కుమారుడు షణ్ముఖ అందిస్తున్న సహకారాన్నీ ఉపరాష్ట్రపతి లేఖలో ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతి అభినందన తమలో నూతనోత్తేజాన్ని నింపిందని శ్రీనివాసులు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.
ఉపాధ్యాయుడికి.. ఉపరాష్ట్రపతి అభినందన లేఖ - ఉపాధ్యాయుడు శ్రీనివాసుకు ఉపరాష్ట్రపతి ప్రశంస పత్రం వార్తలు
కదిరికి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాసులును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. తెలుగు సాహిత్యం, భాషాభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఉపరాష్ట్రపతి అభినందన తమలో నూతనోత్తేజాన్ని నింపిందని శ్రీనివాసులు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
![ఉపాధ్యాయుడికి.. ఉపరాష్ట్రపతి అభినందన లేఖ venkayya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11915547-886-11915547-1622102788922.jpg)
ఉపాధ్యాయుడికి ఉపరాష్ట్రపతి ప్రశంస పత్రం