ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిజర్వేషన్లలో గందరగోళం... తెదేపా అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరణ - అనంతలో రిజర్వేషన్ ప్రకటనలో గందరగోళం

రిజర్వేషన్లలో భాగంగా.. అనంతపురం జిల్లా మడకశిర మండలం గోవిందపురం ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. ఈ సమాచారంపై పార్టీల్లో గందరగోళం సృష్టించింది. జనరల్ అని భావించి పొరబడి.. ఐదుగురు పురుషులు, ఓ మహిళ నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన అనంతరం ఆ ఐదుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

తెదేపా అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరణ
తెదేపా అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరణ

By

Published : Mar 12, 2020, 10:33 PM IST

తెదేపా అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరణ

అనంతపురం జిల్లా మడకశిర మండలం గోవిందపురం ఎంపీటీసీ స్థానం రిజర్వేషన్ విషయంలో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయింటినట్టు అధికారులు చెబుతుండగా.. అభ్యర్థులు మాత్రం జనరల్ గా పొరపాటు పడిన విషయం స్పష్టమవుతోంది. నామినేషన్ల సందర్భంగా.. ఐదుగురు పురుషులు, ఓ మహిళ ఈ స్థానానికి బరిలో నిలవగా.. పరిశీలన అనంతరం ఐదుగురు పురుషుల నామపత్రాలను అధికారులు తిరస్కరించారు. అధికారులు గందరగోళం సృష్టించిన కారణంగానే.. ఈ పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు వాపోయారు. స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ కు పరిస్థితి వివరించి.. ఎన్నిక ఏకగ్రీవం కాకుండా చూడాలని కోరారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని సబ్ కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలవలేమన్న భయంతోనే వైకాపా నేతలు.. ఇలాంటి కుట్రలు చేస్తున్నారని తెదేపా హిందూపురం నియోజకవర్గ పర్యవేక్షకుడు హనుమంతరాయచౌదరి విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details