ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురం వైకాపాలో తారాస్థాయికి వర్గ విభేదాలు - హిందూపురం వైకాపాలో వర్గ విభేదాలు న్యూస్

సోషల్ మీడియా పోస్టులు అనంతపురం జిల్లా హిందూపురం వైకాపాలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్నాయి. హిందూపురం పార్లమెంట్ ఇంఛార్జ్ నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా పోస్టులు పెట్టుకోవటంతో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

హిందూపురం వైకాపాలో తారాస్థాయికి వర్గ విభేదాలు
హిందూపురం వైకాపాలో తారాస్థాయికి వర్గ విభేదాలు

By

Published : Jan 18, 2021, 8:28 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం వైకాపాలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. హిందూపురం పార్లమెంట్ ఇంఛార్జ్ నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో పంచాయతీ పోలీసుల వద్దకు వెళ్లింది. నవీన్ వర్గీయులను ఒకటో పట్టణ స్టేషన్​కు పిలిపించిన పోలీసులు...అసభ్యకర పోస్టులు పెట్టవద్దంటూ హెచ్చరించారు.

హిందూపురం వైకాపాలో తారాస్థాయికి వర్గ విభేదాలు

ఇక్బాల్ వర్గీయలను వదిలేసి.. తన అనుచరులను స్టేషన్​కు పిలిచి వార్నింగ్ ఇచ్చారంటూ నవీన్ నిశ్చల్ ఒకటో పట్టణ సీఐతో వాగ్వాదానికి దిగారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని.. అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేయటంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిజమైన వైకాపా కార్యకర్తలు తన వైపే ఉన్నారని.. ఎమ్మెల్సీ ఇక్బాల్ వైపు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారే అధికంగా ఉన్నారన్నారు.

ఇదీచదవండి:'ఎన్నికలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ అడ్డురాదు'

ABOUT THE AUTHOR

...view details