Hindupuram YSRCP: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అధికార వైకాపాలో మరోసారి వర్గ పోరు భగ్గుమంది. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా వైకాపా మాజీ సమన్వయకర్త చౌలూరు రామకృష్ణా రెడ్డి, వైకాపా ఎంపీపీ, సర్పంచులు సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ అతని పీఏలు బ్రోకర్లుగా మారారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్బాల్ మూడేళ్లుగా హిందూపురంలో ముగ్గురితో బ్రోకర్ పాలన సాగిస్తున్నారని చౌలురు రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఒకరు ప్రభుత్వ కార్యాలయాల్లో దందాకు తెరలేపగా.., మరొకరు ఇసుక మాఫియా.., ఇంకో వ్యక్తి ఉద్యోగుల ట్రాన్స్ఫర్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
హిందూపురం వైకాపాలో మరోసారి భగ్గుమన్న వర్గ పోరు - వైకాపాలో వర్గ పోరు
Conflicts in YSRCP: రాష్ట్రంలో అధికార వైకాపాలో వర్గపోరు తారాస్థాయికి చేరుతుంది. ఇటీవల పలువురు నేతలను పిలిపించుకొని అదిష్ఠానం మందలించినా.. ఇంకా కొన్ని చోట్ల అంసతృప్తి చల్లారటం లేదు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైకాపాలో అసమ్మతి బహిర్గతమైంది. ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన ఎంపీపీ పదవి నుంచి తొలగిస్తామని.. ఓ మహిళ ఎంపీపీని బెదిరించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. గత సర్పంచ్ ఎన్నికల్లో వైకాపా నాయకులపై ఎమ్మెల్సీ అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. ఇప్పటికీ ఎమ్మెల్సీ ఇక్బాల్ నియోజవకర్గంలో పోలీస్ బాస్‌గా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వక్తం చేశారు. ఎమ్మెల్సీ వద్ద ఉన్న గోపీకృష్ణ, లతీఫ్, లోకేశ్‌లను దూరం పెట్టి పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. లేకుంటే నియోజకవర్గ కేడర్‌ను అధిష్ఠానం వద్దకు తీసుకెళ్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి