ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో వైకాపా నాయకుల మధ్య విభేదాలు..

అనంతపురం జిల్లా కదిరిలో వైకాపా నాయకుల మధ్య విభేదాలు చెలరేగాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించ లేదంటూ.. నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Conflicts
కదిరిలో వైకాపా నాయకుల మధ్య విభేదాలు..

By

Published : Mar 24, 2021, 1:56 PM IST

అనంతపురం జిల్లాలో వైకాపా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించడం లేదంటూ.. వైకాపా నేత పూల శ్రీనివాసులు రెడ్డి.. మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే సిద్దారెడ్డి వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కదిరి ప్రాంతీయ వైద్యశాలలో ఆవరణలో భవన సముదాయం నిర్మాణానికి మంత్రి శంకరనారాయణ.. ఎంపీ మాధవ్, ఎమ్మెల్యే సిద్దారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో అవమానం జరిగిందంటూ.. శ్రీనివాసులురెడ్డి వేదిక పైనుంచి దిగి మధ్యలోనే వెళ్లిపోయారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తుంచుకోవాలని.. కార్యకర్తలను కాపాడుకునే వాడే నిజమైన నాయకుడంటూ.. అసంతృప్తిని వెల్లగక్కారు. ఎంపీ గోరంట్ల మాధవ్ సముదాయిస్తున్నా.. ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details