ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నార్పలలో వైకాపా నేతల మధ్య వివాదాలు - Conflicts between ysrcp leaders in Narpala

అనంతపురం జిల్లా నార్పలలో వైకాపా నేతల మధ్య వివాదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ నేతలు రెండు వర్గాలుగా చేరి.. ఒకరిపై మరొకరు ఆరోపించుకున్నారు.

Conflicts between ysrcp leaders
నార్పలలో వైకాపా నేతల మధ్య వివాదాలు

By

Published : Jul 9, 2021, 10:21 AM IST

అనంతపురం జిల్లా నార్పలలో వైకాపా నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. నార్పలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వీధిలైట్లు ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు సత్యనారాయణ రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా మరో వర్గం.. రఘునాథ్ రెడ్డి మొరుసు బ్రదర్స్, పల్లె జయరాంరెడ్డి, లోకనాథ్ రెడ్డి, మిద్దె కుల్లాయప్ప, థియేటర్ భాస్కర్ రెడ్డి.. పార్టీకి ద్రోహం చేశారని, ఎమ్మెల్యే కార్యక్రమం నుంచి బయటికి పోవాలని హల్ చల్ చేశారు. ఇదంతా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఎదుటే జరిగినా.. ఆమె ప్రేక్షక పాత్రవహించారు. అయితే సత్యనారాయణ రెడ్డి అనుచరులు ఆగడాలు ఎక్కువ అవ్వటంతో.. పోలీసులు కలగజేసుకుని గొడవలు జరగకుండా సర్దిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details