అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో ఘర్షణ జరిగింది. భూమికోసం జరిగిన ఈ గొడవలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన ఈరన్న, శంకర్ కుటుంబాల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. తాజాగా ఈ వివాదం ముదిరి ఒకరిపై మరొకరు కొడవళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఈరన్న తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఈరన్నను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరో ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న శెట్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం ఘర్షణ... ఒకరి పరిస్థితి విషమం - అనంతపురం జిల్లా నేర వార్తలు
అనంతపురం జిల్లా చిన్నంపల్లిలో భూమి విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.
ఆస్తి కోసం ఘర్షణ... ఒకరి పరిస్థితి విషమం