ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలింగ్ కేంద్రంలో.. వైకాపా, తెదేపా శ్రేణుల వాగ్వాదం - అనంతపురం పంచాయతీ

ఓ వ్యక్తి ఇదివరకే ఓటు వేశాడు. అయినా.. మళ్లీ పోలింగ్ వద్దకు వచ్చి ఓటు వేయాలని ప్రయత్నించాడు. అధికారులు అతడిని గుర్తించి నిలువరించారు. సదరు వ్యక్తి తిరిగి వెళ్లిపోకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న తెదేపా..వైకాపా శ్రేణులు కలగచేసుకున్నారు. అది కాస్త గొడవగా మారింది. పోలీసుల చొరవతో అంతా సద్దుమణిగింది. ఈ ఘటన అనంతపురం రూరల్ రాచనపల్లిలో జరిగింది.

fake vote issue
పోలింగ్ వద్ద వాగ్వాదం

By

Published : Feb 17, 2021, 5:00 PM IST

అనంతపురం రూరల్ రాచనపల్లిలో పోలింగ్ వద్ద వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ వ్యక్తి తనది కాని ఓటును వేయడానికి పోలింగ్ కేంద్రానికి రావడంతో గొడవ మొదలైంది. వైకాపాకు చెందిన వ్యక్తి తన ఓటును ఇదివరకే వినియోగించుకున్నాడు. కానీ మళ్లీ ఓటు వేయడానికి వచ్చాడని కొందరు గుర్తించి అడ్డుకున్నారు.

అయినా.... సదరు వ్యక్తి.. అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అక్కడున్న వైకాపా.. తెదేపా కార్యకర్తల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని వెనక్కి పంపారు.

ABOUT THE AUTHOR

...view details