ముంబయి నుంచి ఈ నెల 6న ప్రత్యేక శ్రామిక్ రైలులో వచ్చిన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంఘాల గ్రామం వాసులు 19 మంది వలస కూలీలను.. అధికారులు ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. 14 రోజుల క్వారంటైన్ ముగించుకుని వచ్చిన వలస కూలీలను అనుమతించేది లేదంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు.
ఫలితంగా గ్రామస్థులు, వలస కూలీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని గుంతకల్లులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.