ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘర్షణగా మారిన గొడవ.. వ్యక్తి దుర్మరణం! - అనంతపురం క్రైం న్యూస్​

చికెన్ షాపు విషయంలో ఏడేళ్లుగా కొనసాగుతున్న గొడవ.. ఘర్షణకు దారి తీసింది. చివరికి ఓ ప్రాణం బలైంది.

murder
murder

By

Published : Apr 29, 2020, 6:28 PM IST

డబ్బు విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి మరణానికి దారి తీసింది. పోలీసుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా మదనపల్లె బాపణకాలనీకి చెందిన అబ్దుల్‌ సలీం.. తన దుకాణాన్ని మహ్మద్‌ అలీ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. మూడేళ్ల తర్వాత ఒప్పందం మేరకు గడువు ముగిసిందని... దుకాణం తీసుకుని తన ఒకటిన్నర లక్ష రూపాయల డబ్బు ఇవ్వాల్సిందిగా అలీ‌.. సలీంను కోరాడు.

సలీం డబ్బు ఇవ్వని కారణంగా.. గత 7 ఏళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై తాజాగా ఇద్దరూ మళ్లీ ఘర్షణ పడ్డారు. సలీం దాడిలో అలీ తలకు గాయమైంది. తిరుపతికి తరలిస్తుండగా అలీ చనిపోయాడు. సలీంతో పాటు... మరో మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details