ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు - tdp anantapuram news

చెత్త సేకరణ కార్మికుడిగా విధులు నిర్వహించేందుకు రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి గ్రామంలో జరిగింది.

Conflict between the Tdp and ysrcp
రెండు వర్గాల మధ్య ఘర్షణ

By

Published : May 21, 2020, 4:09 PM IST


అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి గ్రామంలో గత కొన్నేళ్లుగా తెదేపాకు చెందిన వ్యక్తి చెత్త సేకరణ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. వైకాపాకు చెందిన వ్యక్తికి ఆ విధులు అప్పగించాలంటూ తెదేపా, వైకాపా వర్గాల మధ్య వివాదం సాగుతోంది. చెత్తను సేకరించే సైకిల్​ను వైకాపాకు చెందినవారు తీసుకెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు, కొడవళ్లతో దాడులకు దిగడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గ్రామానికి చేరుకొని ఘర్షణకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడినవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details