అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ విద్యార్థుల మధ్య ఘర్షణ వివాదస్పదంగా మారింది. సీనియర్స్, జూనియర్స్ భోజనానికి వెళ్లిన సమయంలో ఇరువురి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇది గమనించిన అధ్యాపకులు... గొడవకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారంని బయటకి వచ్చిన పరిస్థితుల్లో... విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలకు చేరుకున్నారు. విద్యార్థి సంఘాల నేతలను, మీడియా ప్రతినిధులను కళాశాల యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడం ఆందోళనకు దారి తీసింది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
మాటా మాటా పెరిగి.. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య ఘర్షణ - students
భోజనానికి వెళ్లే సమయంలో సీనియర్స్‌కు, జూనియర్స్‌కు మధ్య చేలరేగిన చిన్నపాటి వాగ్వాదం... ఘర్షణకు దారి తీసింది.

ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ