ఓ ప్రేమ జంట చేసిన పనికి వారి ఇరు కుటుంబాల్లో పెద్ద గొడవలు జరిగిన ఘటన ఆదివారం రాత్రి ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు తెలిస్తే అంగీకరించరని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అంతే పెళ్లి వివషయం తెలిసిన పెద్దలు ఆగ్రహించారు. రెండు కుటుంబాలు తీవ్ర ఘర్షణకు దిగాయి.
ప్రేమికులు ఇద్దరు మేజర్లే. అందులోనూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. పెళ్లి చేసుకొని వస్తే పెద్దల్ని ఒప్పించవచ్చన్న ధీమాతో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు యువకుడి కుటుంబ సభ్యులతో తగాదా పెట్టుకున్నారు. రాత్రి తీవ్ర వాదన జరిగింది.