గుట్కా, నాటుసారా పట్టివేత.. ఐదుగురి అరెస్ట్ - GUTKA SEZED AT ANATAPUR
అనంతపురం జిల్లాలోని వివిధ మండలాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లు, నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా తనకల్లు, తలుపుల మండలాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చీకటిమానిపల్లిలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 13 వేల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. తలుపుల మండలం బలిజపల్లి తండా వద్ద నాటు సారా తయారు చేస్తున్న నలుగురిని అరెస్టు చేసిన అధికారులు... బెల్లం ఊటను ధ్వంసం చేసి.. సారా స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: నల్లచెరువు మండలంలో కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం