అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే అధికారులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణికులు తీసుకోవలసిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. రైల్వే స్టేషన్లోకి ప్రవేశించేముందు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ.. చేతులను శానిటైజర్‌తో శుభ్రపరుచుకోవాలని అవగాహన కల్పించారు. థర్మల్ స్కానర్‌తో ప్రయాణికుడిని పరీక్షించి టికెట్ కౌంటర్ దగ్గరికి అనుమతిస్తారు.
గుంతకల్లు రైల్వేస్టేషన్లో మాక్ డ్రిల్ - mock drill conducted in gunthakal railway station
ప్రయాణికులు తీసుకోవలసిన జాగ్రత్తలపై... అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే అధికారులు, ఉద్యోగులు రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు.
conduct moc drill in anantapur dst railwaystation
ఈ విధానాన్ని ప్రయాణికులకు అర్థమయ్యేలా అధికారులు చేసి చూపించారు. టికెట్ తీసుకున్న తర్వాత... టికెట్ కలెక్టర్ పరిశీలించి స్టేషన్లోకి అనుమతిస్తారు. ఫ్లాట్‌ఫాంలో కూర్చున్న సమయంలో... భౌతికదూరం పాటించాలని అధికారులు సూచించారు.