ప్రభుత్వం పంపిణీ చేసిన వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతులు ఆందోళన చేశారు. కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్‌డివిజన్‌లోని ఓ ప్రజా ప్రతినిధి, అతని బంధువులు, సంబంధిత అధికారులు తమకు నాణ్యత లేని విత్తనాలు అంటగడుతున్నారంటూ రైతన్నలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై స్పందించిన అధికారులు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తామని తెలిపారు. రైతులకు వారి గ్రామాల్లోనే పంపిణీ చేస్తామని వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు మల్లికార్జున స్పష్టం చేశారు.
వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని ఆందోళన - కళ్యాణదుర్గం నేటి వార్తలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తోన్న వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని... వెంటనే తమకు నాణ్యమైన విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు.
నాసిరకంగా ఉన్న వేరుశనగ విత్తనాలు