రైల్వేలో ప్రైవేటీకరణను నిరసిస్తూ అనంతపురం జిల్లా గుత్తిలో వామపక్ష పార్టీల నాయకులు నిరసన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. రైల్వే ప్రైవేటీకరణ వల్ల భవిష్యతులో మధ్యతరగతి కుటుంబాలు రైల్లో ప్రయాణం చేయడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గుత్తిలో వామపక్ష పార్టీ నాయకుల అందోళన - ananthapuram district latest news
అనంతపురం జిల్లా గుత్తిలో వామపక్ష పార్టీల నాయకులు నిరసన చేపట్టారు. రైల్వేలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గుత్తిలో వామపక్ష పార్టీ నాయకుల అందోళన