కియా పరిశ్రమ భూనిర్వాసితులకు పరిహారం పంపిణీ - comensation to kia rehablitants
కియా పరిశ్రమ డంపింగ్ యార్డు కోసం భూమిని ఇచ్చిన నిర్వాసితులకు మంత్రి శంకర్ నారాయణ పరిహారం అందించారు.
కియా భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కియా పరిశ్రమ డంపింగ్ యార్డు కోసం 39.45ఎకరాల ఇచ్చిన రైతులకు మంత్రి శంకర్ నారాయణ పరిహారం అందించారు. 10మంది రైతులకు రూ.4.14లక్షలు పరిహారం పంపిణీ చేశారు. పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూనిర్వాసితులతో సమావేశం నిర్వహించి లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నగదును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.