ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు'

మత పరమైన ఆస్తులపై దాడులు జరగకుండా పర్యవేక్షణ చేయటానికి జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. జిల్లాలో ఎలాంటి మతపరమైన ఘర్షణలు జరగకపోయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

committee-on-temple
committee-on-temple

By

Published : Jan 9, 2021, 11:01 AM IST

"అనంతపురం జిల్లాలో మతసామరస్యానికి విఘాతం కలిగించే శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. తప్పుచేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు" అని కలెక్టర్‌ గంధం చంద్రుడు హెచ్చరించారు. మత సామరస్య కమిటీ ఏర్పాటు, బాధ్యతలపై శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజాదర్బార్‌ హాలులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల మనోభావాలను పరిరక్షించేందుకు జిల్లా స్థాయి మత సామరస్య కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీలో ఛైర్మన్‌గా కలెక్టర్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎస్పీ, జేసీ కన్వీనర్‌గా దేవదాయ, మైనార్టీ శాఖల అధికారులతో పాటు పలువురు సభ్యులుగా ఉంటారన్నారు.

గణతంత్ర వేడుకలపై సమీక్ష

గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వేడుకలపై శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజాదర్బార్‌ హాల్‌లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అనంత నగరంలోని పోలీసు కవాతు మైదానంలో వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు.

బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం వద్దు

గత ఏడాది గనులశాఖ ద్వారా రావాల్సిన బకాయిలు ఎందుకు వసూలు చేయలేదని అధికారులను.. కలెక్టర్‌ ప్రశ్నించారు. గనులు, ఇసుక రవాణాపై శుక్రవారం కలెక్టరేట్‌లోని చిన్నసమావేశ మందిరంలో జేసీ నిశాంత్‌కుమార్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనుకున్న స్థాయిలో గనుల అక్రమదారుల నుంచి జరిమానాలు ఎందుకు వసూలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆశాఖ అధికారులను ఆదేశించారు. సమీక్షలో గనులశాఖ డీడీ రమణరావు, ఏడీలు బాలాజీనాయక్‌, ఆదినారాయణ, ఇసుక అధికారి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం-10మంది నవజాత శిశువులు మృతి

ABOUT THE AUTHOR

...view details