ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో కరోనా కట్టడికి కమిటీ - Committee for Control in Anantapur news

అనంతపురంలో కరోనా కట్టడి కోసం కమిటీలను ఏర్పాటుచేశారు. ఏడీసీసీ బ్యాంకు సమావేశ మందిరంలో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడానికి కమిటీలు తోడ్పడనున్నాయి.

  Committee for corona Control   in Anantapur
కలెక్టర్ సమావేశం

By

Published : May 24, 2021, 10:53 PM IST

కరోనా కట్టడికి కమిటీల ఏర్పాటు ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అనంతపురంలోని ఏడీసీసీ బ్యాంకు సమావేశ మందిరంలో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. కమిటీ ఛైర్మన్​గా జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఉంటారని, కన్వీనర్​గా జిల్లా కలెక్టర్ బాధ్యత వహిస్తారని, ఇతర అధికారులు, నాయకులు సభ్యులుగా ఉంటారని కలెక్టర్ చెప్పారు. గ్రామస్థాయి నుంచి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడానికి కమిటీలు తోడ్పడతాయన్నారు. అలాగే జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ అమలు చేయని పక్షంలో తగిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని తెలిపారు. రుణాల కోసం రైతులు బ్యాంకులు ఇబ్బందులను చూసి మరో సంవత్సరం తాము చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత గతంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details