ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్​ జోన్​ వద్దంటూ కాలనీ వాసుల నిరసనలు - మడకశిర రెడ్​జోన్ వార్తలు

31 రోజులుగా రెడ్​జోన్​లో ఉంచేసరికి ఆ కాలనీ వాసులు ఆగ్రహించారు. ఆంక్షలను ఎత్తేయాలంటూ ఆందోళన చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Colony members protest for dont want to Red Zone in madakasira town in ananthapuram district
Colony members protest for dont want to Red Zone in madakasira town in ananthapuram district

By

Published : Jun 8, 2020, 4:26 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంపై.. పట్టణంలోని ఆర్యపేటవీధిని అధికారులు రెడ్ జోన్​గా ప్రకటించారు. అది జరిగి 31 రోజులు గడిచినా... జోన్​ను తొలగించలేదని ఆ వీధి వాసులంతా ఉదయం ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నానికి స్పష్టత ఇస్తామని ఎస్ఐ తెలపగా... ఆందోళన విరమించుకున్నారు.

అధికారులు చెప్పిన సమయానికి రాకపోవడంపై... ఆగ్రహించిన వీధి వాసులు బయటకు వచ్చి రహదారిపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులకు, కాలనీ వాసులకు వాగ్వాదం జరిగింది. చివరకు తహసీల్దార్ కలగజేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రెడ్​జోన్​ను తొలగించేందుకు చర్యలు చేపడతామని చెప్పగా.. వారు శాంతించారు.

ABOUT THE AUTHOR

...view details