ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్లర్క్ నిర్లక్ష్యం... ఆందోళనలో విద్యార్థులు - అనంతపురం జిల్లా నేర వార్తలు

ప్రభుత్వ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 137 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వారి మార్కుల మెమోలను సిబ్బంది పోగొట్టటంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లర్క్​ను విచారిస్తున్నారు.

college staff loss student memos in bommanahal ananthapuram district
యాజమాన్యం నిర్లక్ష్యంతో ఆందోళనలో విద్యార్థులు

By

Published : Oct 12, 2020, 10:52 PM IST

అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్​లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో... 137 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశారు. వీరిలో చాలా మంది ఎంసెట్, నీట్​లతోపాటు, వివిధ విశ్వవిద్యాలయాల డిగ్రీ పోటీపరీక్షలు రాసి ర్యాంకులు సాధించారు. వీరంతా ఇంటర్ మార్కుల జాబితా కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో కళాశాలకు చెందిన క్లర్కు జాకీర్ హుసేన్... మార్కుల మెమోలు తీసుకోవటానికి అనంతపురానికి వెళ్లారు. 137 మంది విద్యార్థుల మార్కుల జాబితా తీసుకుని వస్తుండగా... మార్గమధ్యలో వాటిని పోగొట్టుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్​కు తెలిపారు. ఈ విషయాన్ని మూడు రోజులుగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియనీయకుండా గోప్యంగా ఉంచారు.

ఘటనపై బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... మెమోలు పోగొట్టుకున్నది అనంతపురంలో కాబట్టి అక్కడ పోలీసులను సంప్రదించాలని సూచించారు. పోలీసుల సూచనతో అనంతపురం మూడో పట్టణ పోలీసులకు కళాశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీ కెమెరాలను పరిశీలించి, క్లర్క్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని నిర్థరించారు. క్లర్క్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు... తీవ్ర ఆందోళన పడుతున్నారు.

ఇదీ చదవండి:

బంగాళాఖాతంలో మరింత బలపడిన వాయుగుండం

ABOUT THE AUTHOR

...view details