అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లిలో జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభించేందుకు వచ్చిన కలెక్టర్ గంధం చంద్రుడు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల ఇంటి వద్దకు వెళ్లారు. జీవక్రాంతి లబ్దిదారులతో మాట్లాడారు. పెరవలి గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి భూ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని లబ్దిదారులు కలెక్టర్కు తెలియజేశారు. శింగనమల మండలం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన తమ సమస్య పరిష్కరించడంలో ఎమ్మార్వో, వీఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. కలెక్టర్ స్పందించి వారం రోజుల్లో భూ సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో, వీఆర్వోను ఫోన్లో ఆదేశించారు.
'భూ సమస్యను పరిష్కరించకపోతే... చర్యలు తప్పవు' - Anantapur District Collector Gandham Chandradu News
ఎన్నో ఏళ్లుగా భూసమస్యను పరిష్కరించాలని తహాసీల్దార్ కార్యాలయం చూట్టు కాళ్లు అరిగెలా తిరిగిన ఫలితం లేదని బాధితులు కలెక్టర్ ఎదుట వాపోయారు. తమ గోడును పట్టించుకోనేవారు లేరని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పెరవలి గ్రామానికి వచ్చిన కలెక్టర్ గంధం చంద్రుడుకి చెప్పారు. వెంటేనే సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో, వీఆర్వోలను ఆదేశించారు.
కలెక్టర్ గంధం చంద్రుడు