అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని ఆవరణను, రికార్డులను పరిశీలించారు. కరోనా రోగులతో మాట్లాడి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భయాన్ని వీడాలని తెలిపారు. అనంతరం తిమ్మాపురం గ్రామం వద్ద కొవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన 150 పడకల ఆయుష్ ఆసుపత్రిని పరిశీలించారు.
ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి కోరనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. కొవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నవారికి చికిత్స అందించి... తక్కువ లక్షణాలు కలిగిన వారిని కొవిడ్ కేర్ సెంటర్కు తరలించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ని ఆదేశించారు.