ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తాం' - Anantapur district news

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. హిందూపురంలోని వేదిక్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్​లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్​ను ఆయన పరిశీలించారు.

Collector Gandham chandrudu
Collector Gandham chandrudu

By

Published : May 11, 2021, 11:13 AM IST

అనంతపురం జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం హిందూపురం మండల పరిధిలోని తూముకుంట పారిశ్రామిక వాడలో ఉన్న వేదిక్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్​ని కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ నిశాంతి, పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ పరిశీలించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు గంధం చంద్రుడు తెలిపారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రితోపాటు అనంతపురం సర్వజన ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కదిరి గుంతకల్లు ఏరియా ఆస్పత్రిలో వేయి లీటర్ల చొప్పున ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమల్లో ఉత్పత్తి చేసే ఆక్సిజన్​ను తీసుకుంటామని అన్నారు. హిందూపురం మండలంలో ఉండే వేదిక్ ఇస్పాత్ 500 సిలిండర్లు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. ఏ ఆస్పత్రికి అవసరమైన ఆక్సిజన్ను ఆస్పత్రే ఉత్పత్తి చేసుకునేలా ప్లాంట్ లో నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు.

ఇదీ చదవండి:పెద్దాసుపత్రుల్లో 42 ఆక్సిజన్‌ ప్లాంట్లు

ABOUT THE AUTHOR

...view details