అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ప్రత్యామ్నాయ విత్తన పంపిణీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. విత్తన పంపిణీ విధానంలో ఇబ్బందులు, వ్యవసాయ పరిస్థితులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులంతా తీసుకున్న విత్తనాన్ని కచ్చితంగా పొలాల్లో వేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో స్పందన పై వచ్చిన ఫిర్యాదులను, పలు రికార్డులను పరిశీలించారు.
విత్తన పంపిణీ కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - district collector satyanarayana
అనంతపురం జిల్లాలో ప్రత్యామ్నాయ విత్తన పంపిణీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. విత్తన పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం స్పందనపై వచ్చిన ఫిర్యాదులను, పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు.
రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్
విత్తనాల పంపిణీ సమయంలో... క్యూలైన్లలో నిలబడి రైతులు తోసుకున్నారు. ఈ సంఘటనలో పసులూరు గ్రామానికి చెందిన ఓబులమ్మ అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:రైతు చేతికే పంట నష్ట పరిహారం: సీఎం జగన్