అనంతపురంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హాజరయ్యారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. మంచి నేతను ఎన్నుకోటానికి ఓటు.. యువతకు ఆయుధమని చెప్పారు.
ప్రతి వయోజనుడు తమ ఓటు నమోదుచేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కేఎస్సార్ కళాశాల నుంచి విద్యార్థులతో ర్యాలీ చేసి... ఆర్ట్స్ కళాశాల మైదానంలో అవగాహన సదస్సు నిర్వహించారు.