అనంతపురం జిల్లా శింగనమల మండలంలో వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. రైతులకు విత్తన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఇప్పటివరకు విత్తనాల కోసం జరిగిన రిజిస్ట్రేషన్లు, ఎంతమంది రైతులకు విత్తన ప్యాకెట్లను అందించారనే వివరాలు వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ - peanut seed distribution program news
అనంతపురం జిల్లా శింగనమల మండలంలో రైతులకు వేరుశెనగ విత్తన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొని.. పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.
వేరుశెనగ విత్తనాలను పరిశీలిస్తున్న కలెక్టర్
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. జిల్లావ్యాప్తంగా వేరుశనగ విత్తన పంపిణీ సజావుగా సాగేలా చూడాలని సంబంధిత శాఖ జేడీ, ఏవోలను ఆదేశించారు.
ఇదీ చదవండి:ఓ వైపు విధుల నిర్వహణ..మరోవైపు సేవలు