ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనీఖీలు - ananthapuram

అనంతపురంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్టల్ వార్డెన్​, టీచర్లకు మధ్య సమన్వయం లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తనీఖీ చేసిన కలెక్టర్

By

Published : Aug 10, 2019, 7:41 AM IST

బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తనీఖీ చేసిన కలెక్టర్
అనంతపురంలోని ఉరవకొండ బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనీఖీలు చేశారు. పాఠశాలలోని సమస్యలు, వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో టీచర్లు తమ విధులను సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారం రోజుల లోపు పనితీరు మెరుగు పడకుంటే తాత్కాలిక టీచర్లను విధుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. శాశ్వత టీచర్లను వేరే ప్రాంతాలకు బదిలీ చేయడం లేదా సరెండర్ చేయడం జరుగుతుందున్నారు. అనంతరం కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.

ABOUT THE AUTHOR

...view details