అనంతపురం జిల్లా గుంతకల్లులో వైయస్‌ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణాలను కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించనున్న సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గుంతకల్లుకు రానున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు.
గుంతకల్లులో జగనన్న గృహ నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ - అనంతపురం తాాజా వార్తలు
అనంతపురం జిల్లా గుంతకల్లులో వైయస్‌ఆర్ జగనన్న కాలనీల గృహనిర్మాణాలను కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. గృహ నిర్మాణాలను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రేపు ప్రారంభించనున్నందున.. ఏర్పాట్లను పర్యవేక్షించారు.
దాదాపు 2,23,000 మంది జగనన్న ఇళ్ల పట్టాలు పొందారని, వాటిలో 1,11,000 మంది ఇళ్ల నిర్మాణాలను ఫేజ్-1 లో చేపట్టనున్నామని కలెక్టర్ చెప్పారు. జూన్ 3న జిల్లాలో 8,000 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామన్నారు. గుంతకల్లు ఆర్బన్ లే అవుట్లో 143 ఇళ్లకు పునాది వేయనున్నామని తెలిపారు. ఆరు నెలల్లోగా ఫేజ్-1 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పేజ్-1లో చేపట్టనున్న లక్షకు పైగా నిర్మాణాలకు కావాల్సిన ఇసుక, సిమెంట్, ఇతర సామగ్రి గురించి అంచనాలు సిద్ధం చేశామన్నారు. ఆ మేరకు సామాగ్రి కొరత రాకుండా చూసేందుకు ప్రణాళిక చేపట్టామని చెప్పారు.
ఇదీ చదవండి:అనంతపురంలో కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి బొత్స