అనంతపురం జిల్లా మడకశిర పట్టణం ఆరేపేట వీధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదవటంతో ప్రజలతో పాటు అధికారులు ఉలిక్కిపడ్డారు. పాజిటివ్ వ్యక్తితో కాంటాక్ట్ అయిన వ్యక్తులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఆ వీధిలో రెడ్ జోన్ ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి క్వారంటైన్ కేంద్రానికి వెళ్లి అక్కడి వారిని వసతుల గురించి ఆరా తీశారు. పాజిటివ్ కేసులు పెరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మడకశిర రెడ్ జోన్ ప్రాంతాన్ని సందర్శించిన కలెక్టర్ - మడకశిరలో కరోనా కేసులు
అనంతపురం జిల్లా మడకశిరలోని రెడ్ జోన్ ప్రాంతాన్ని కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. అక్కడ పాజిటివ్ కేసులు పెరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మడకశిర రెడ్ జోన్ ప్రాంతాన్ని సందర్శించిన కలెక్టర్