సంక్షేమపథకాలు క్షేత్రస్థాయిలో అమలుతీరును తెలుసుకునేందుకు జిల్లాలోని మారుమూల గ్రామమైన కదిరి మండలం ఎర్రదొడ్డి పంచాయతీ పరిధిలోని రామదాసునాయక్ తండాను కలెక్టర్ గంధం చంద్రుడు సందర్శించారు. వ్యవసాయ, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లే తండావాసులు అందుబాటులో ఉండే సమయంలోనే తండాకు రావాలనే ఉద్దేశంతో రాత్రి వచ్చినట్లు ఆయన చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అమలు తీరు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
'పథకాల అమలుతీరు తెలుసుకునేందుకు.. తండాకు వెళ్లిన కలెక్టర్' - రాములునాయక్తండాలో బస చేసిన కలెక్టర్ గంధం చంద్రుడు వార్తలు
ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు లబ్ధిదారుడి అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. మంగళవారం రాత్రి ఆయన రామదాసునాయక్ తండాకు వెళ్లారు.
రామదాసుతండావాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తండాకు వచ్చేందుకు హంద్రీనీవా కాలువపై నిర్మించిన వంతెనను కలెక్టర్ ప్రారంభించారు. రాత్రివేళ తమ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన కలెక్టర్ కు తండావాసులు సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు నుంచి వచ్చిన వినతుల్లో ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయని కలెక్టర్ అన్నారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టింది: చంద్రబాబు