ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల ఇళ్ల స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ - ధర్మవరంలో పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్ల పరిశీలన

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కుణుతూరు గ్రామం వద్ద పేదలకు ఇవ్వనున్న ఇంటి స్థలాల లేఅవుట్​ను... జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. జిల్లాలో 2లక్షల మంది లబ్ధిదారులకు... ఈ నెల 25న ఇంటి స్థలాలు అందజేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

collector gandham chandrudu inspects house sites to be distributed
పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్

By

Published : Dec 11, 2020, 5:10 PM IST

అనంతపురం జిల్లాలో 2లక్షల మంది లబ్ధిదారులకు... ఈ నెల 25న ఇంటి స్థలాలు అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ధర్మవరం మండలం కుణుతూరు గ్రామం వద్ద పేదలకు ఇవ్వనున్న ఇంటి స్థలాల లేఅవుట్ ఆయన పరిశీలించారు. కులాలకతీతంగా అందరూ ఒకేచోట నివాసం ఉండే విధంగా జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. రవాణా చార్జీలు మాత్రమే భరించాలని కలెక్టర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details