కోడి మాంసం, గుడ్డు తినడం వలన కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి చెందదని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. వదంతుల కారణంగా పౌల్ట్రీ రంగంతో పాటు అనుబంధంగా ఆధారపడ్డ వారు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. భవిష్యత్‌లో కోడి మాంసం, గుడ్లు అందుబాటులో లేకుండాపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలెవరూ అపోహలకు గురి కావద్దని, నిర్భయంగా వాటిని తినవచ్చని సూచించారు. మరోవైపు జిల్లాలో కరోనా కేసులు, అనుమానితులు కాని లేరని తెలిపారు.
కరోనాతో కాదు.. వదంతులతో పౌల్ట్రీకి ప్రమాదం - అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తాజా వార్తలు
కరోనా వైరస్ (కోవిడ్-19) మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది కాని.. జంతువులకు రాదని కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులు కోడి మాంసంతో పాటు గుడ్లు తిని ప్రజలకు కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించారు.
కరోనా వైరస్‌పై జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమం
TAGGED:
కరోనా వైరస్ తాజా వార్తలు