సమాజంలో అన్ని వర్గాల ప్రజలూ తమ హక్కులను తెలుసుకుని జీవించాలని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో ఉపాధిహామీ కూలీల కోసం ఆర్డీటి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన.. హక్కులపై అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రాజ్యాంగంలో పేదలకు కల్పించిన హక్కులపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ప్రత్యేకించి ఉపాధి హామీ కూలీలు తమ హక్కులను తెలుసుకొని.. సంపాదించుకునే సొమ్ముతో హుందాగా బతకాలని పిలుపునిచ్చారు. పలువురు గ్రామీణ ప్రాంత కూలీలు.. ఈ కార్యక్రమంలో పాల్గొని అనుమానాలు నివృత్తి చేసుకున్నారు.