ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంపు బాధితుల జాబితాను తనిఖీ చేసిన కలెక్టర్ - Collector checked the list of flood victims in dharmavaram

చిత్రావతి జలాశయం నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.240 కోట్లు మంజూరు చేసిందని ఆయన అన్నారు.

ముంపు బాధితుల జాబితాను తనిఖీ చేసిన కలెక్టర్
ముంపు బాధితుల జాబితాను తనిఖీ చేసిన కలెక్టర్

By

Published : Oct 5, 2020, 10:32 AM IST


అనంతపురం జిల్లా ధర్మవరం తహసీల్దార్ కార్యాలయంలో చిత్రావతి జలశయం ముంపు పరిహారం లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ గంధం చంద్రుడు తనిఖీ చేశారు. జలాశయం నిర్వాసితులు నాలుగు గ్రామాల వారు ఉన్నారని..1729 మందికి వన్​టైమ్ సెటిల్​మెంట్ కింద రూ.10లక్షల చొప్పున ​​పరిహారం చెల్లిస్తామని ఆయన అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.240 కోట్లు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అక్రమాలకు తావు ఇవ్వకుండా జాబితాను రూపొందించి నిర్వాసితుల ఖాతాలకు నగదు జమ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details