అనంతపురంలో జిల్లా కలెక్టర్ భవనంలోని పురాతన గది పైకప్పు కూలింది. కూలిన ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జిల్లా కలెక్టర్ నివాసముండే బంగ్లాలో డ్రాయింగ్ రూమ్ దాదాపు 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు పైకప్పు మరమ్మతుకు చేరింది. ఈ తరుణంలో అధికారులు వీటి మరమ్మతులకు చర్యలు తీసుకున్నారు.
Collector Building: కలెక్టర్ బంగ్లాలో కూలిన పైకప్పు.. - ఏపీ తాజా వార్తలు
అనంతపురం కలెక్టర్ బంగ్లాలోని డ్రాయింగ్ రూమ్ పైకప్పు కూలింది. 150 ఏళ్లనాటి భవనం గది పైకప్పు నీటి నిల్వతో ఉంది. మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
collector building
పనిచేసే సమయంలో ఉన్నపలంగా పైకప్పు కూలినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. బ్రిటిష్ కాలం నాటి గది పైకప్పు కూలడంతో సోషల్ మీడియాలో కలెక్టరేట్ బంగళాలో పైకప్పు కూలినట్లు ఫొటోలు వైరల్ అయ్యాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఉండటంతోనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పలువురు వాపోతున్నారు.
ఇదీ చదవండి: కాబుల్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లు- 72 మంది మృతి