అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 10వేల కొబ్బరి మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. స్పెయిన్ దేశానికి చెందిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్డీటీ సంస్థను జిల్లాలో స్థాపించి, వేలాది కుటుంబాలను ఆదుకున్న సంగతి తెలిసిందే. నేడు ఆయన వర్థంతిని పలు గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. కళ్యాణదుర్గంలో ఎకాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ శెట్టి, రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు, ఎస్టీఎల్ నరసింహులు పలువురికి పదివేల కొబ్బరి ముక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ... సామాజిక దూరం పాటిస్తూ ఆర్డీటీ సిబ్బంది మొక్కలను పంపిణీ చేశారు.
ఆర్డీటీ ఆధ్వర్యంలో కొబ్బరిమొక్కలు పంపిణీ - ఈటీవీ భారత్ తాజా వార్తలు
ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 10వేల కొబ్బరిమొక్కలను సంస్థ ప్రతినిధులు పంపిణీ చేశారు.
కొబ్బరిమొక్కలు పంపిణీ: ఆర్డీటి సంస్థ