అనంతపురం జిల్లా మడకశిర, పెనుకొండ, రొద్దం మండలాల్లో నిర్మాణంలో ఉన్న సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాల భవనాలను.. ముఖ్యమంత్రి కార్యదర్శి సల్మాన్ ఆరోక్యరాజ్ అకస్మికంగా పరిశీలించారు. వాటి నాణ్యతను పరీక్షించారు. భవనాల నిర్మాణం ఏ మేరకు పూర్తయిందనే విషయంపై ఆరా తీశారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కార్యదర్శితో పాటు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు ఉన్నారు.
నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన సీఎం కార్యదర్శి - సీఎం కార్యదర్శి సల్మాన్ ఆరోక్యరాజ్ వార్తలు
అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కార్యదర్శి అకస్మికంగా పర్యటించారు. ఆయా మండలాల్లో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. పెనుకొండ, రొద్దం, మడకశిర తదితర మండలాల్లో సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాల భవనాలను సందర్శించారు.
నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన సీఎం కార్యదర్శి