31న అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన! - kia
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31న అనంతపురం జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కియా కంపెనీలో ఈనెల 31న కార్ల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుందని... ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశం ఉందని అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కియా కంపెనీలో నెలకొన్న సమస్యలపై పెనుకొండ ఆర్డీఓ కార్యాలయంలో పలుశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కియా కోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు లభించేలా... స్వల్పకాలిక కోర్సులు డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. కంపెనీ అవసరాలకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యం లేనందున... వారికి డ్రైవింగ్, గార్మెంట్స్ తదితర రంగాల్లో ఉపాధి ఇచ్చేలా కోర్సు ఉండాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.