CM JAGAN HELP TO THREE YEARS OLD BOY TREATMENT : మూడున్నర సంవత్సరాల వయసులోనే లివర్ దెబ్బతిని అనారోగ్యం బారిన పడిన బాలుడి చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకరరెడ్డి దంపతుల కుమారుడు యుగంధర్ రెడ్డికి మూడున్నర సంవత్సరాలు. చిన్న వయసులోనే లివర్ దెబ్బతింది. వైద్యుల సూచనలతో బెంగళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లారు.
సీఎం జగన్ స్పందన.. మూడున్నర సంవత్సరాల బాలుడి వైద్యానికి సాయం
CM JAGAN HELP: లివర్ దెబ్బతిని అనారోగ్యం పాలైన మూడున్నర సంవత్సరాల బాలుడి చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
ఏడు నెలలపాటు తిరిగి అన్ని పరీక్షలు చేయించారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని, పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలియజేశారు . దివాకర్ రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో వెచ్చించలేని స్థితిలో.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకువెళ్లారు. దివాకరరెడ్డి దంపతులు తమ కుమారుడి అనారోగ్య పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని వారికి భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి:
TAGGED:
CM JAGAN HELP