ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Relief to Agrigold depositors: అగ్రిగోల్డ్‌ బాధితులకు రెండో విడత నగదు జమ

అగ్రిగోల్డ్‌ బాధితులకు రెండోవిడత నగదును ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు బాధితుల ఖాతాల్లో వర్చువల్‌గా సీఎం జగన్ నగదు జమ చేశారు.

Relief to Agrigold depositors
Relief to Agrigold depositors

By

Published : Aug 24, 2021, 11:40 AM IST

Updated : Aug 24, 2021, 12:10 PM IST

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు.. ముఖ్యమంత్రి జగన్ నగదు చెల్లింపులు చేశారు. 3 లక్షల 14 వేల మంది బాధితులకు.. 459 కోట్ల 23 లక్షల రూపాయలను.. వారి ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి డిపాజిటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి చిన్న వ్యాపారులు ఎంతో నష్టపోయారునన్న సీఎం.. బాధితులకు గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు రెండో విడత నగదు జమ

"మరో మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసింది. బాధితులను ఆదుకోవడంలో విఫలమైంది. ప్రైవేటు సంస్థ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును బాధితులకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇలా ఆదుకున్న ఘటన దేశ చరిత్రలో ఎక్కడా లేదు. గత ప్రభుత్వం వ్యక్తుల కోసం జరిగిన మోసం అగ్రిగోల్డ్ స్కామ్. ఎంతో కష్టపడి పొదుపు చేసిన వారు మోసపోయారు. రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన 3.40 లక్షల మందికి 2019 నవంబర్ లోనే రూ. 238.73 కోట్లు చెల్లించాం. రూ. 10 వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన 3.86 లక్షల మంది డిపాజిటర్లకు 207.61 కోట్లు చెల్లింపులు చేస్తున్నాం. రూ. 10 వేల నుంచి రూ. 20 వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన దాదాపు 3.14 లక్షల మంది బాధితులకు 459.23 కోట్ల రూపాయల చెల్లింపులు చేస్తున్నాం. అర్హులైన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఇంటింటికీ వెళ్లి మరీ పారదర్శకంగా బాధితులను గుర్తించాం. సీఐడీ ద్వారా బాధితులను గుర్తించి సాయం చేస్తున్నాం. మొత్తం 7 లక్షల370 మంది కి అర్హులైన అగ్రి గోల్డ్‌ బాధితులకు రూ. 666.84 కోట్లు జమ చేస్తున్నాం. ఇప్పటికే ఇచ్చిన వాటన్నింటినీ కలుపుకుంటే 10.40 లక్షల మందికి రూ. 905.57 కోట్లు ఇచ్చినట్లవుతుంది. కోర్టుల్లో కేసు కొలిక్కి రాగానే అగ్రిగోల్డ్ భూములను ఆస్తుల్ని అమ్ముతాం. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు తీసుకుని మిగిలిన డబ్బును డిపాజిట్ దారులకు న్యాయపరంగా అందిస్తాం" - వైఎస్ జగన్, ముఖ్యమంత్రి

Last Updated : Aug 24, 2021, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details