అనంతపురం జిల్లాలో వైకాపా నేతల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణలు నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. హిందూపూరంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, నవీన్ నిశ్చల్ మధ్య వివాదాలపై.. ఇరువురు నేతలు సజ్జల ఎదుట చెప్పుకున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ తనపై కేసులు పెట్టిస్తున్నారని.. నవీన్ నిశ్చల్ ఆవేదన చెందారు. పోలీసులను గుప్పెట్లో పెట్టుకొని తనను వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. వారిద్దరికి నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
అనంతలో మరోసారి భగ్గుమన్న విభేదాలు.. సర్దిచెప్పేందుకు యత్నించిన నేేతలు - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లాలో వైకాపా నేతల మధ్య మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణలు.. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ నేతలు విభేదాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలని వారు సూచించారు.

అనంతలో మరోసారి భగ్గుమన్న విభేదాలు.. సర్దిచెప్పేందుకు యత్నించిన నేేతలు
విభేదాలు పక్కనపెట్టి అందరూ కలసికట్టుగా పనిచేసి.. అత్యధికంగా ఏకగ్రీవాలు అయ్యేలా కృషిచేయాలని సజ్జల పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఆశావహులపై పార్టీ సర్వే చేయించిందని, అధిష్టానం నిర్ణయించిన వారే సర్పంచి అభ్యర్ధులవుతారని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:ముగిసిన తొలి దశ ఎన్నికల ప్రచారం..మెుదలైన ప్రలోభాల పర్వం